టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోలలో ఒకరు అయిన అక్కినేని అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే .

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత అఖిల్ నటిస్తున్న సినిమా కావడం , సైరా నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఏజెంట్ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఏజెంట్ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ , అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. దానితో ఇప్పటి వరకు కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ సినిమాను ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. కాక పోతే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీ దాదాపుగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి వున్న ఈ సినిమా నుండి ఇప్పటి వరకు చిత్ర బృందం కేవలం పోస్టర్ లను మినహాయిస్తే పెద్దగా ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయలేదు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏజెంట్ సినిమా టీజర్ ను జూలై 10 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా టీజర్ ను జూలై 10 వ తేదీన విడుదల చేస్తారా... లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: