ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో విడుదల కావడానికి రెడీ గా ఉన్నాయి. అలా ఈ వారం 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో విడుదల కావడానికి రెడీ గా ఉన్నా ఇండియన్ సినిమాల గురించి తెలుసుకుందాం.

పక ( రివర్ ఆఫ్ బ్లడ్ ) : జూన్ 7 వ తేదీ నుండి  సోనీ లివ్ 'ఓ టి టి' లో మలయాళంలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.


విక్రమ్ : లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా జూలై 8 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' లో తమిళ్ , తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ భాషలలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ లో విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ , సూర్య కీలక పాత్రలలో నటించారు.


జై భజరంగి : జూలై 8 వ తేదీ నుండి ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.


కంజెల్డో : ఈ సినిమా మా జీ 5 'ఓ టి టి' లో మలయాళం భాషలో జూలై 8 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.


అంటే సుందరానికి : నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో జూలై 10 వ తేదీ నుండి తెలుగు , తమిళ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott