మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా యొక్క టీజర్ నిన్న సాయంత్రం విడుదల అయింది. మెగా అభిమానులు ఎంతగానో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ సమయం వచ్చి రాగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు మెగాస్టార్ ను ఏ విధంగా అయితే చూడాలనుకున్నారో అదే విధంగా చూసి ఎంతో ఆనంద పడిపోతున్నారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మొదటగా గాడ్ ఫాదర్ సినిమా వస్తుండగా అది విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లూ ఈ టీజర్ లో స్పష్టం చేశారు.

తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకుడిగా మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ చిత్రానికి రీమేక్ గా తెరకక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా మెగా అభిమానులను మాత్రమే కాదు ప్రేక్షకులందరికీ కూడా బాగా అలరిస్తుందని నమ్ముతున్నారు. నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరవనుండడం విశేషం. ఈ నేపథ్యంలో వీరి పాత్రలు సినిమాలో ఏ విధంగా ఉంటాయోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. 

ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా విడుదల చేస్తామని ఈ టీజర్ లో స్పష్టం చేసింది కానీ విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. దసరా పండుగ సమయంలో ఈ సినిమా రావడం అభిమానులకు నిజంగా పండగ లాంటిదే అని చెప్పాలి. ఆచార్య తో నిరాశ లో ఉన్న మెగా అభిమానులు ఈ సినిమా ఆ నిరాశను పూడ్చలని చూస్తున్నారు.  ఇక చిరు నటిస్తున్న మరో సినిమా భోళా శంకర్ సినిమా కూడా దీపావళి పండుగ సమయంలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ సినిమాకు రీమేక్ కాగా ఈ చిత్రంలో మెగాస్టార్ తనదైన శైలిలో నటించాడని అంటున్నారు. ఇక బాబీ దర్శకత్వంలోని సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోబోతుండగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: