ఇటీవల కాలంలో తమిళ హీరోలు తెలుగు సినిమాలలో వరుసగా నటించడం మనం చూస్తున్నాం. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు హీరోలు ఇప్పుడు తెలుగు దర్శకులతో తెలుగులో సినిమాలు చేస్తూ ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తమిళ హీరోలు కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే ప్రేక్షకులను అలరించేవారు. అలా వారికి వచ్చిన క్రేజ్ తో ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

గతం లో ఒకరిద్దరు డైరెక్ట్  తెలుగు సినిమాలు చేశారు కానీ అవి మంచి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వారు పూర్తిగా డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడమే మానేశారు . ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు మంచి మార్కెట్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వారు ఈ విధమైన సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే తమిళనాడు నుంచి ఈ కోరిక బాలీవుడ్ హీరోలకి కూడా పాకినట్లు అనిపిస్తుంది తాజా పరిణామాలను బట్టి. 

కొంతమంది బాలీవుడ్ హీరోలు ఇప్పుడు తెలుగు సినిమాలలో డైరెక్ట్ గా నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇక్కడి దర్శకులతో నిర్మాతలతో వారు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో సక్సెస్ అయినా కొంతమంది దర్శకుల ను బాలీవుడ్లోకి పిలిపించి మన చిత్రాలను అక్కడ రీమేక్ చేయించుకుంటున్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాలను తీయాలని వారు కోరుతున్నడం విశేషం. మరి తమ హీరోల మాదిరిగానే బాలీవుడ్ హీరోలకి కూడా ఇక్కడి సినిమాలు కలిసి వచ్చి వారికి మంచి మార్కెట్ ను తీసుకువస్తాయా అనేది చూడాలి. బాలీవుడ్ లో అగ్ర హీరోలుగా ఉన్న సల్మాన్ ఖాన్, రణభీర్ కపూర్ వంటి హీరోలు ఇప్పటికే తెలుగు లో సినిమాలు చేయడానికి సిద్ధమ్ అవుతున్నారు. మరి వారికి ఈ తెలుగు సినిమాలు ఏ స్థాయి లో విజయాన్ని తెచ్చిపెడతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: