సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప రెండో భాగం సినిమా షూటింగ్ కు సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.  ఆగస్టు నుంచి ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రారంభం అవబోతుంది అన్నట్లుగా చెబుతున్నారు. మొదటి భాగం సంచలన విజయాన్ని సాధించడంతో ఈ చిత్రాన్ని అంతకుమించి విజయాన్ని అందుకునేలా చేయాలని చిత్ర బృందం ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ వచ్చింది.

ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా అపీల్ పెంచడానికి నార్త్ ప్రేక్షకులను ఇంకా అలరించడానికి సిద్ధమైన సుకుమార్ ఇన్ని రోజులు ఈ చిత్రం యొక్క కథపై కసరత్తులు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క కథపై అందరూ సంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని షూటింగ్ దశకు తీసుకువెళ్లడానికి సిద్ధమవుతోంది చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలను పూర్తి చేసింది. ఇక చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉండడంతో ఈ సినిమాను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేసి ఆ తర్వాత వచ్చే ఏడాది సమయం చూసుకొని విడుదల చేయాలని భావిస్తుంది. 

మరి ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. అల్లు అర్జున్ మరియు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో రక్తి కట్టిస్తాయి అని అంటున్నారు. రెండవ భాగంలో కూడా సునీల్ మరియు అనసూయ పాత్రలు ఎంతో కీలకం కాబోతున్నాయట. వీరితోపాటు మరొక మెయిన్ కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నాడని అంటున్నారు ఆ పాత్ర కోసం విజయ్ సేతుపతి ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. త్వరలోనే దీనిపై కూడా క్లారిటీ ఇవ్వనుంది. మరి అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో తెరకెక్కుతుందో చూడాలి. వచ్చే ఏడాదిలో ఎప్పుడు ఈ సినిమాను విడుదల చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: