టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏ మాత్రం ఆలచించకపోవడంతో ఇక ఆయన పని అయిపోయింది అని అం దరూ అనుకోవడం మొదలుపెట్టారు. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా రంగమార్తాండ కూడా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఈ చిత్రం ఎలా బ్రతికి బట్ట కట్ట కలుగుతుందో అని అందరూ అనుమాన పడుతున్నారు. అంతకుముందు ఆయన చేసిన సినిమా సైతం ప్రేక్షకులను ఏమాత్రం మేప్పించలేకపోవడంతో ఆయన తదుపరి సినిమా ఏ విధంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందో అన్న అనుమానాలు ఎదురవుతున్నాయి.

అయితే ఇన్ని సందేహాల మధ్య ఎన్నో అనుమానాల మధ్య తన ఇప్పుడు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవుతూ ఉండడం అందరిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. కృష్ణవంశీ 300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా రూపొందించబోతున్నాడని అంటున్నారు. ఇప్పుడు ఫామ్ లో ఉన్న దర్శకులకు సైతం ఇది సాధ్యం కాని పని అలాంటిది అవుట్ డేటెడ్ దర్శకుడు ఇది ఎలా సాధ్యమని విశ్లేషకులు ఆశ్చర్యపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు.

 త్వరలోనే దీన్ని మొదలు పెట్టబోతున్నట్లుగా కృష్ణవంశీ సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దర్శకుడిగా కృష్ణవంశీకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సినిమాలకు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. అయితే ఆ తర్వాత కాలంలో ట్రెండ్ కు తగ్గ  సినిమాలు చేయకపోవడంతో ఈ దర్శకుడికి సినిమా అవకాశాలు రాలేదు. క్రియేటివ్ గా ఈ డైరెక్టర్ కృష్ణవంశీ తెలుగు లో మంచి మంచి సినిమాలే చేసి ఇండస్ట్రీ రికార్డులను తెరకెక్కించాడు. అయితే ఇప్పటి యువ దర్శకులతో అయన పోటీ పడలేకపోతున్నాడు. మరి ఇప్పుడు చేస్తున్న సినిమాల ద్వారా అయన ఏ స్థాయి లో కం బ్యాక్ చేస్తాడో చూడాలి. రంగామర్తండ సినిమా త్వరలోనే ఒటీటీ లో విడుదల కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: