నటుడిగా సత్యదేవ్ ఏ స్థాయిలో నటిస్తాడో అందరికీ తెలిసిందే. హీరో పాత్ర అని మాత్రమే కాకుండా మంచి పాత్ర అయితే ఏ సినిమా లో అయినా తప్పకుండా నటించి ప్రేక్షకుల మనసు దోచుకునేవాడు. ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాల ద్వారా మాత్రమే కాకుండా పాత్రల ద్వారా కూడా ఆయన అందరిని ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే గాడ్సే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఆ సినిమాలో అందరిని ఎంతగానో తన పాత్రతో మెప్పించాడు. అందుకే ఇప్పుడు ఈ హీరో తో సినిమా చేయాలని చాలామంది క్రేజీ దర్శకులు భావిస్తున్నారు

తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న శీతాకాలం గుర్తుందా చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. జూలై 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా ఈ సినిమాకు మంచి క్రేజీనెస్ యాడ్ అవడానికి ప్రముఖ కారణం అయ్యింది అని చెప్పాలి. ఇప్పటిదాకా పెద్ద హీరోలతో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం నిజంగా విశేషం అనే చెప్పాలి.

ఇది తప్పకుండా సత్యదేవ్ కు మంచి సినిమానే అవుతుంది అయితే ఇప్పటిదాకా మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు ప్రేమకథ సినిమాలతో చేయడం ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనేది చూడాలి. వాస్తవానికి ఎప్పుడూ విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో అన్నదే ఇక్కడ అసలు సమస్య. తమన్నా అభిమానులైతే ఈ చిత్రం తప్పకుండా బాగుంటుంది అని చెబుతున్నారు. మరి జూలై 15వ తేదీన రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: