సినిమాలు మొదలు పెట్టే విషయంలో హీరోలలో ఇప్పుడు రోజు రోజుకు బద్ధకం పెరిగిపోతుంది. ఒక సినిమా పూర్తి చేసిన తర్వాత హీరోలు వెంటనే తమ తదుపరి సినిమా చేయడానికి చాలా సమయాన్ని తీసుకుంటున్నారు. కారణం ఏదైనా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసే విషయంలో అగ్ర హీరోలు వెనకడుగు వేస్తున్నారు.  సినిమాలు ఒప్పుకుంటున్నారు కానీ ఆ చిత్రాలను మొదలు పెట్టుకోవడంలో మాత్రం చాలా ఆలస్యం చేస్తున్నారు. ఆ విధంగా మహేష్ బాబు ఈ విషయంలో ముందు వరసలో ఉంటారు. ఆయన తన ప్రతి సినిమాకి మధ్య కనీసం రెండు నెలల గ్యాప్ అయినా ఉంటుంది అలా ఆ రెండు నెలలు ఫ్యామిలీ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ గడుపుతూ ఉంటాడు

ఆ విధంగా చేయడం మహేష్ కు ఆనందకరమే అయిన కూడా కొంతమంది మహేష్ అభిమానులకు మాత్రం నిరాశనే మిగులుస్తుంది. కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా మహేష్ నటించిన ఒకే ఒక్క సినిమా విడుదల అయింది అది కూడా మే నెలలో విడుదలైన సర్కారు వారి పాట సినిమా అయితే అది ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించలేదు దాంతో ఆయన నటించిన సినిమాను త్వరగా చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు 

అయితే త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు కానీ మహేష్ మాత్రం ఈ సినిమాలో ఇంకా మొదలు పెట్టకపోవడం వారిని ఎంతగానో నిరాశ పరుస్తుంది. ఇప్పుడే కాదు గతంలోనూ మహేష్ ఒక సినిమా పూర్తి అయిన తర్వాత మరొక సినిమాను మొదలుపెట్టే విషయంలో చాలా సమయం తీసుకునేవాడు అయితే అప్పుడు మహేష్ కు మంచి హిట్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ తీసుకున్న పర్వాలేదు కానీ ఇప్పుడు త్వరగా సినిమాను మొదలుపెట్టి అభిమానుల హిట్ ఆకలి తీర్చాలని ఆయన హార్డ్ కోర్ అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: