టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినా కార్తీ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ టాలీవుడ్ ఇండస్ట్రీలో యుగానికి ఒక్కడు మూవీ తో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఆవారా , నా పేరు శివ , శకుని,  కాకి , ఖైదీ , సుల్తాన్ వంటి పలు మూవీ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన క్రేజ్ ను మరింత రెట్టింపు చేసుకున్నాడు. 

ఇలా తాను నటించిన తమిళ మూవీ లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కార్తీ ప్రస్తుతం సర్దార్ మరియు పొన్నియన్ సెల్వన్ మూవీ లలో  హీరోగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కార్తీ నటిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నాడు. పొన్నియన్ సెల్వన్ సినిమాలో కార్తీ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమా లోని కార్తీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో కార్తి గుర్రంపై రాజసంగా కూర్చొని ఉన్నాడు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ మూవీ లోని కార్తీ ఫస్ట్ లుక్ కు సంబంధించిన  పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అలాగే ఈ పోస్టర్ ద్వారా కార్తీ ఈ సినిమాలో వంతియతేవన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా చిత్ర బృందం తెలియజేసింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా మొదటి భాగం 30 అక్టోబర్ 2022 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ తదితరులు నటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: