ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటులలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎల్బీ శ్రీరామ్.. సీనియర్ నటుడైన ఈయన సినిమాల మీద చాలా ఆసక్తితో నాటకారంగంలోకి అడుగుపెట్టి..ఇక తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఇక ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో కూడా ఆయన పనిచేశారు. ఇక అలాగే ఎన్నో నాటకాలలో ప్రదర్శన ఇచ్చిన ఈయన తన ప్రతిభతో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆయన సినిమాలలో కూడా తన ప్రతిభను నిరూపించుకుంటూ ప్రముఖ నటుడిగా ఎదిగారు. అయితే ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు గొప్ప రచయిత కూడా.. ఎన్నో సినిమాలకు చాలా అద్భుతమైన కథలను అందించాడు.ఇక దర్శకుడిగా కూడా ఆయన పనిచేశారు. ఇక తర్వాత సినిమాలలో అతిధి పాత్రలు వేస్తూ ఫుల్ బిజీ అయిన ఈయన మరొకవైపు హలో బ్రదర్ ఇంకా హిట్లర్ లాంటి సినిమాలకు మాటల రచయితగా కూడా పనిచేసి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. నేటి తరంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగే ఇక ఆ కాలంలో ఎల్వి శ్రీరామ్ కూడా తాను రాసిన డైలాగులకు ఎన్నో చిత్రాలు పెద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. మంచి నటుడిగా, హాస్యనటుడిగా ప్రేక్షకులను మెప్పించడంలో దిట్ట. ఇక ఆ తర్వాత కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా ఈయన నటించి ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు.


ఇక ఇదిలా ఉండగా చిరంజీవి సినిమా వల్లే ఎల్బీ శ్రీరామ్ తన కెరీర్ లో అన్ని నష్టాలనే ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్ సినిమా తర్వాత తనకు చాలా అవకాశాలు వస్తాయని ఎల్బీ శ్రీరామ్ ఎంతగానో భావించారట. కానీ చిరంజీవికి ఆ సినిమాలో తక్కువ డైలాగులు అనేవి ఉండడంతో ఈ సినిమా తర్వాత రచయితగా ఆయనకు పాపం ఎలాంటి గుర్తింపు రాలేదు.ఇక అంతేకాదు రచయితగా అవకాశాలు కూడా రాకపోవడం వల్ల నటుడుగా ఆయన స్థిరపడిపోయినట్లు ఎల్బీ శ్రీరామ్ వెల్లడించారు. ఇక ఈ క్రమంలోని ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇంకా లక్ష్మీ జంటగా నటించిన మిధునం సినిమాలో కూడా నటించాలని తనకే మొదటగా ఆఫర్ వచ్చిందట.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈయన స్థానంలో సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ను తీసుకున్నారు. ఇక ఈ సినిమాకి సహనటుడు అయిన తనికెళ్ల భరణి రచనా దర్శకత్వం వహించడం జరిగింది.. ఇక కేవలం రెండు పాత్రలనే చూపించిన ఈ సినిమా మంచి సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: