ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన వాకాడ అప్పారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి ఇంకా చరణ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఇంకా నిర్మాతనైన నేను ఎగ్జిక్యూటివ్ గా మారడానికి ఒక హిందీ సినిమా కారణమని ఆయన అన్నారు.ఇక ఆర్బీ చౌదరి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సమయంలో నాకు పరిచయమయ్యారని ఆయన తెలిపారు. దేవుడు ఉన్నాడని దేవుడే మనల్ని చూసుకుంటాడని ఆయన అప్పుడు చెప్పుకొచ్చారు.ఆర్బీ చౌదరి గారు ఇక ఆయన స్టార్ట్ చేస్తున్న కంపెనీలోకి పిలిచారని షేర్ తీసుకోవాలని చెప్పారని వాకాడ అప్పారావు తెలిపారు. కేవలం ఒక్క రూపాయితో నేను భాషా సినిమాను సంపాదించానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక భాషా సినిమా సమయంలో చౌదరి గారు 5 లక్షల రూపాయలు ఇచ్చారని ఆయన తెలిపారు. ఆర్బీ చౌదరి తమిళంలో తీసిన నాట్టామై సినిమా సంచలన విజయం సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఈ సూపర్ గుడ్ ఫిల్మ్స్ తెలుగు ప్రస్థానం మొదలైందని వాకాడ అప్పారావు పేర్కొన్నారు.


తమ కాంబినేషన్ లో మొత్తం 40కు పైగా సినిమాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఆర్బీ చౌదరి కుటుంబం మంచి కుటుంబం అని ఆయన బ్రాహ్మిణ్ అని ఇంకా మాంసం కూడా తినరని వాకాడ అప్పారావు పేర్కొన్నారు.రామ్ చరణ్ తో మేము రచ్చ సినిమా చేశామని అప్పుడు చిరంజీవి నుంచి పిలుపు వచ్చిందని వాకాడ అప్పారావు తెలిపారు.అలాగే బండ్ల గణేష్ నాకు క్లోజ్ అని డబ్బుల విషయంలో బండ్ల గణేష్ ను నేను ఏమీ అననని ఆయన తెలిపారు. ఇంకా అలాగే బండ్ల గణేష్ నన్ను ఎంతో గౌరవించాడని ఆయన చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ తో గొడవలు జరలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక చిరంజివీ మామూలు వ్యక్తి కాదని ఆయన మనుషులను చూసి పేగులు లెక్కపెడతాడని సినిమా అంటే ఆయనకు ఫింగర్ టిప్స్ అని వాకాడ అప్పారావు కామెంట్లు చేశారు. ఇక చిరంజీవి దర్శకునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని కూడా ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: