తెలుగు ప్రేక్షకులకు ఉప్పెన సినిమాతో దగ్గరైన బ్యూటీ కృతి శెట్టి.. ఆ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ సినిమాలను కూడా చాలా సెలెక్టివ్‌గా ఎంచుకుంటూ అదిరిపోయే సక్సెస్‌లను అందుకుంటోంది ఈ భామ. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాలేవీ కూడా ఫ్లాప్ కాకపోవడం విశేషం. దీంతో అమ్మడిని తమ సినిమాల్లో నటింపజేసేందుకు యంగ్ హీరోలు లైన్ కడుతున్నారు.


ఈ అమ్మడు తాజాగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సరసన 'ది వారియర్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సక్సెసె ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని ఈ బ్యూటీ భావిస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కృతి శెట్టి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారింది. ఈ క్రమంలోనే కృతి శెట్టి తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి ఇండస్ట్రీ వర్గాల చూపులను తనవైపు తిప్పుకుంది..


స్టార్ హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులపై కృతి శెట్టి కొన్ని కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌లో రామ్ చరణ్ చాలా క్యూట్ అని, మహేష్ బాబు హ్యాండ్‌సమ్ హీరోలంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తింది. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోల గురించి కృతి శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఇద్దరు హీరోలతో అమ్మడు సినిమా చేయాలని తన మనసులోని మాటను చెప్పకనే చెప్పేసిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏదైనా రాబోయే కాలంలో నిజంగానే ఈ బ్యూటీ ఈ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆమె అభిమానులు ధీమ వ్యక్తం చేస్తున్నారు. మరి కృతి శెట్టి కామెంట్స్ నిజంగానే ఆ హీరోలతో సినిమాలు చేసేందుకేనా అనేది తెలియాలంటే మాత్రం అమ్మడు స్పందించే వరకూ ఆగాల్సిందే.. మొత్తానికి చేతి నిండా సినిమాల తో ఫుల్ బిజీ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: