గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమ లో టిక్కెట్ల ధరలు తగ్గడం వల్ల సినిమా హిట్ పడలేదని పెద్దలు అన్నారు. ఆ విషయం పై తెలుగు రాష్ట్రాల లో పలు జరిపిన ఆనంతరం టిక్కెట్లను కొంతవరకూ పెంచారు..దాంతో సినిమా కలెక్షన్స్ కొద్దిగా పెరిగిన విషయం అందరికి తెలిసిందే.నిజంగానే టికెట్ రేట్లు పెరగడం వల్లే థియేటర్స్ కు జనం రావడం లేదు అనుకున్నారంతా. కానీ అందులో ఎలాంటి నిజం లేదని.. టికెట్ రేట్లు కాస్త ప్రభావం చూపించినా కూడా కంటెంట్ లేని సినిమాలను చూడడానికి ఆడియన్స్ అసలు ఆసక్తి చూపించడం లేదనే విషయం గత కొన్ని రోజులుగా వస్తున్న సినిమాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది.


జూన్ మొదటి వారంలో మేజర్, విక్రమ్ సినిమాలు వచ్చి అద్భుతమైన విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు కూడా తక్కువ టికెట్ రేట్లతో వచ్చాయి. దానికి తోడు సినిమాలో కంటెంట్ కూడా చాలా బలంగా ఉంది. దాంతో రెండు సినిమాలు సంచలన విజయం సాధించాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకోలేదు..


నాని అంటే సుందరానికి, రానా విరాటపర్వం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశ పరిచాయి. ఒక్కో సినిమా కనీసం 10 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది. మరోవైపు మొన్న జూలై 1న గోపీచంద్ హీరోగా మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ సినిమాకు కూడా చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. పైగా పరమ రొటీన్ కథతో మారుతి తెరకెక్కించిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇన్ని రోజులు టికెట్ రేట్ల కారణంగానే థియేటర్స్ కు జనం రావడం లేదని చెప్పుకున్న వాళ్లకు నెల రోజులుగా వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి...ఏది ఏమైనా కూడా సినిమా టిక్కెట్ రేటు లో కాదు, సినిమాలో విషయం ఉండాలి అప్పుడే సినిమాలు హిట్ అవుతాయని జనాలు అభిప్రాయ పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: