సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ పుత్రిక శృతి హాసన్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. తెలుగు, హిందీ భాషల్లోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ ను సొంతం చేసుకుంది. తెలుగులో ఆమె చేసిన పలు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలవడం తో, ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్ స్థాయిని కూడా అందుకుంది. అయితే తన బాయ్ ఫ్రెండ్‌ తో బ్రేకప్ కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ, ఇప్పుడు తిరిగి సినిమాల్లో యమబిజీగా మారింది.


టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రుతి హాసన్ పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ప్రభాస్‌తో కలిసి 'సలార్', చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో శ్రుతి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే శ్రుతి హాసన్ ఇటీవల పోస్ట్ చేసిన ఓ వీడియో తో ఆమెకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. తన వర్కవుట్ వీడియోను షేర్ చేసి తనకున్న హార్మోనల్ ఇష్యూస్ గురించి చెప్పుకొస్తూ.. తాను మానసికం గా ఎంతో ధృడంగా ఉన్నా, ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపింది..


చాలా మంది ఆడవారికి వచ్చే సమస్య తోనె తాను కూడా బాధపడుతుందని చెప్పింది. ఈ వార్తను పలు మీడియా ఛానళ్లు మరో విధంగా టెలికాస్ట్ చేశాయి. శ్రుతి హాసన్ ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో జాయిన్ అయ్యిందని మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, ఈ విషయంపై శ్రుతి ఫ్యాన్స్ ఆందోళన చెందుతుండటం తో, తాజాగా ఈ అంశం పై శ్రుతి స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది. తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తాను చాలా బాగున్నానని, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నానని శ్రుతి ఓ వీడియో పోస్ట్ చేసింది.. నెగిటివ్ కామెంట్స్ మాత్రం ఎప్పుడూ చెయ్యొద్దని విజ్ఞప్తి చేసింది... 

మరింత సమాచారం తెలుసుకోండి: