ఈ వయసులో చిరంజీవి పేరు ఎందుకు మార్చుకుంటారు, ఎవరికోసం మార్చుకుంటారు. వినడానికి ఇది ఫేక్ న్యూస్ అనుకున్నా.. చిరంజీవి కొత్త సినిమా గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ చూసినవారెవరూ దీన్ని ఫేక్ అని కొట్టిపారేయరు. ఏదో జరిగింది అని అనుకుంటారు. అవును, నిజమే చిరంజీవి పేరు మార్చుకున్నారనే వార్తలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి.

అసలేం జరిగిందంటే..?
ఇటీవల చిరంజీవి నటించిన రీమేక్ మూవీ గాడ్ ఫాదర్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. టిన్న టీజర్ కూడా విడుదలైంది. ఇందులో చిరంజీవి కొత్త పేరు కనపడింది. సహజంగా సినిమా వాళ్లు ఎక్కువగా న్యూమరాలజీని నమ్ముతారనే విషయం తెలిసిందే. ఆమాటకొస్తే చిరంజీవి అసలు పేరు అది కాదు, కానీ అది న్యూమరాలజీ వల్ల పెట్టుకున్న పేరు కాదు కానీ చిరంజీవిగా ఆయన పేరు మారడం వల్లే ఇంత పెద్ద మెగాస్టార్ అయ్యారని అంటారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన పేరు మార్చుకున్నారా అని గాడ్ ఫాదర్ టీజర్ వల్ల అనుమానాలు మొదలయ్యాయి.


 

సహజంగా చిరంజీవి సినిమాల్లో ఆయన ఇంట్రడక్షన్ ని చెప్పేందుకు megastar chiranjeevi అని టెక్స్ట్ ప్లే చేస్తుంటారు. కానీ గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి పేరులో మరో e యాడ్ అయింది. అంటే చిరంజీవి పేరులో రెండు e లు ఉండాలి, కానీ గాడ్ ఫాదర్ టీజర్ లో మాత్రం మూడు e లు కనిపించాయి. అంటే చిరు పేరు megastar Chiranjeeevi ఇలా ఉందనమాట. దీంతో చిరంజీవి న్యూమరాలజీ  ప్రకారం పేరు మార్చుకున్నట్లు పుకార్లు బయటకొచ్చాయి. ఇక్కడ మరో విషయం కూడా ప్రముఖంగా చెబుతున్నారు. ఇటీవల చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఫ్లాపైంది. రామ్ చరణ్ కూడా ఆ సినిమాలో ఉన్నా.. ఆచార్య ఎందుకో అభిమానులకు కూడా పెద్దగా నచ్చలేదు. ప్రొడక్షన్ వ్యవహారాల్లో కూడా చిరంజీవి కొంత నష్టపోయారని అంటున్నారు. దీంతో చిరంజీవి పేరు మార్చుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.

అయితే ఈ వ్యవహారంపై గాడ్ ఫాదర్ చిత్ర బృందం స్పందించింది. టీజర్ కట్ చేసేపట్టుడు వీడియో ఎడిటింగ్ లో జరిగిన మిస్టేక్ గా దీన్ని చెబుతున్నారు. ఎడిటింగ్ లో టెక్స్ట్ టైప్ చేసేవారి తప్పిదం వల్ల చిరంజీవి పేరులో కొత్తగా మరో E చేరిందని, అంతే కాని, చిరంజీవి స్పెల్లింగ్ ని కావాలని మార్చేయలేదని వారు వివరణ ఇస్తున్నారు. మరి అసలు నిజం ఇదేనా, లేకపోతే చిరంజీవి నిజంగానే పేరులో Eని యాడ్ చేసుకున్నారా..? తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: