సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల విరామం తర్వాత విడుదలైన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో తన 28వ సినిమాని చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. అందుకు సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించలేదు. కానీ ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నట్లు తెలుస్తోంది.


ఈ చిత్రం కోసం మహేష్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు కారణం దాదాపుగా 12 ఏళ్ల తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారు మహేష్ దీంతో మేకర్స్ తో పాటు ఇటు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ సినిమాని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లుగా సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో హీరో నాని కీలకమైన పాత్రలు నటిస్తున్నాడని ప్రచారం కూడా జరి గింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని  నాని తెలియజేయడం కూడా జరిగింది.


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ డైలాగ్ వర్షన్ తో సహా లాక్ చేయడం జరిగింది కేవలం.. నటీనటుల ఎంపిక విషయం మాత్రమే పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇందులో భాగంగా మహేష్ బాబు తండ్రి పాత్రలు ఒక స్టార్ హీరో ఎంపిక చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది అతని ఎవరో కాదు స్టార్ హీరో ఉపేంద్రని సంప్రదించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు ఉపేంద్ర కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ కంటే ఉపేంద్ర ఏడేళ్లు మాత్రమే పెద్దవారు. మరి తండ్రి పాత్రలో ఉపేంద్రని త్రివిక్రమ్ ఎలా చూపిస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇందులో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: