రామ్ పోతినేని ప్రస్తుతం ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రామ్ పోతినేని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. రామ్ పోతినేని కెరియర్ లో మొట్ట మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కావడంతో ది వారియర్ మూవీ పై రామ్ పోతినేని అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ లలో కూడా రామ్ పోతినేని తన అదిరిపోయే కోర మీసాలతో న్యూ లుక్ లో అదరగొట్టాడు. అలాగే ఈ సినిమా టీజర్ , ట్రైలర్ లలో మాస్ మనరిజం తో, అదిరిపోయే డైలాగ్ లతో కూడా రామ్ పోతినేని ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాడు.  ఈ మూవీ లో  కృతి శెట్టి హీరోయిన్ గా నుష్టించగా, ఈ మూవీ లో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని జూలై 14 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది.

ది వారియర్ తమిళ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జులై 6 వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు సత్యం సినిమాస్ చెన్నై లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. మరి ఈ మూవీ తో రామ్ పోతినేని తమిళ ఇండస్ట్రీ పై ఎ రేంజ్ ప్రభావాన్ని చూపుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: