గోపీచంద్ తాజాగా పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మారుతి దర్శకత్వం వహించగా రాశి కన్నా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న పక్కా కమర్షియల్ మూవీ జూలై 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.

ఇలా ప్రపంచ వ్యాప్తంగా జులై 1 వ తేదీన విడుదల అయిన పక్కా కమర్షియల్ మూవీ కి విడుదల అయిన మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ లభించింది. ఈ మూవీ కి విడుదలయిన మొదటి షో కె మిక్సీడ్ టాక్ రావడంతో కలెక్షన్ లు కూడా పర్వాలేదు అనే రేంజ్ లో మాత్రమే దక్కుతున్నాయి. ఇప్పటి వరకు 5 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న పక్కా కమర్షియల్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 2.04 కోట్లు , సీడెడ్ : 1.01 కోట్లు , యూ ఎ : 1.00 కోట్లు , ఈస్ట్ : 59 లక్షలు , వెస్ట్ : 46 లక్షలు , గుంటూర్ : 51 లక్షలు , కృష్ణ : 49 లక్షలు , నెల్లూర్ : 33 లక్షలు .
5 రోజుల బాక్సాఫీస్ రన్ కి గాను పక్కా కమర్షియల్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.43 కోట్ల షేర్ ,10.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  0.30 కోట్లు .
ఓవర్ సీస్ లో : 0.78 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా పక్కా కమర్షియల్ మూవీ 5 రోజులకు గాను 7.51 కోట్ల షేర్ , 12.73 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: