తెలుగునాట మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కన్నడ హీరోలలో ఉపేంద్ర కూడా ఒకరు. ఆయన తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కొన్ని చిత్రాలలో హీరో పాత్రల ద్వారా అలరించిన ఆయన అదే సమయంలో కొన్ని ముఖ్యమైన పాత్రలలో కూడా నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కీలక పాత్రలో మెరసి తెలుగులోకి మంచి కం బ్యాక్ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమాలో కూడా నటించి మరొకసారి ప్రేక్షకులను అలరించారు.

తాజాగా ఆయన మరొక సినిమాలో కూడా నటించే విధంగా రంగం సిద్ధమవుతోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత చేయబోతున్న త్రివిక్రమ్ సినిమాలో ఉపేంద్ర మహేష్ తండ్రిగా నటించబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు 28వ సినిమా గా ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతుండగా 12 సంవత్సరాల తరువాత వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. తొందర్లోనే ఈ సినిమా పట్టాలెక్కుతుండగా ఈ చిత్రంలో ఉపేంద్ర నటించపోయేది నిజమా లేదా కాదా అనేది ఇంకా తెలియరాలేదు.

తొందరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ అధికారిక ప్రకటన రాబోతోంది. త్రివిక్రమ్ తో కలిసి గతంలో ఉపేంద్ర సన్నాఫ్ సత్య మూర్తి సినిమా చేశాడు. ఆ చనువు నేపథ్యంలోనే ఉపేంద్ర కోసం మహేష్ సినిమా లో ఓ మంచి రోల్ రాశాడట. దానికి ఆయన అయితేనే బాగా సూట్ అవతడాని భావిస్తున్నాడట. మరి దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇక పోతే ఉపేంద్ర యూఐ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఇది షూటింగ్ మొదలుపెట్టకుంది. వెరైటీ సినిమాలు చేసే ఉపేంద్ర ఈ చిత్రాన్ని కూడా ఎంతో వెరైటీ గా చేయబోతున్నాడు అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: