ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు బుచ్చిబాబు. తన రెండవ సినిమా కోసం ఇప్పుడు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. ఇంకొక వైపు ఎన్టీఆర్ రెండు సినిమాలను ఓకే చేసుకొని ఆ చిత్రాలు చేసే విధంగా ముందుకు వెళుతుండగా బుచ్చిబాబును పక్కన పెట్టడం అసలు ఈ సినిమా ఉందా అన్న అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు కొంతమంది .

ఈ నేపథ్యంలో పట్టువదలని విక్రమార్కుడిలా బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి నిత్యం శ్రమిస్తూనే ఉన్నాడు. ఓ స్పోర్ట్స్ డ్రామా ను ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధం చేసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు ఆ కథలో ఎన్టీఆర్ చెప్పిన కొన్ని మార్పులు చేయడానికి సిద్ధమవుతాడా అనేదే ఇక్కడ అందరిలో మెదులుతున్న ప్రశ్న. వాస్తవానికి ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న కొరటాల శివ మరియు ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాల కంటే ముందే బుచ్చిబాబు సినిమా తెరకెక్కవలసి ఉంది. కానీ స్క్రిప్ట్ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తిగా లేని ఎన్టీఆర్ కొన్ని మార్పులు చెప్పాడట .

అయితే బుచ్చిబాబు మాత్రం ఆ మార్పులకు ఒప్పుకోకపోవడమే ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం అని చెబుతున్నారు. ఈ సినిమాలో మంచి ప్రేమ కథను ఇమిడించాలని ఎన్టీఆర్ చెప్పగా స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి అలాంటి ట్రాక్ పెడితే తప్పకుండా సినిమాకి మైనస్ అవుతుందనే ఉద్దేశంతో బుచ్చిబాబు ఈ ఆలోచనకు ఎస్ చెప్పలేక పోతున్నాడట. ఎన్టీఆర్ చెప్పిన దాన్ని ఎలా ఈ కథ లో మేనేజ్ చేయాలో అన్న దానిపై ఇప్పుడు కసరత్తులు చేస్తున్నాడు. పెద్ది అనే టైటిల్ ను దీనికి ఫిక్స్ చేయబోతున్నాడట. మరి దీనికి సంబంధించిన కథ ఎప్పుడు ఫైనల్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: