బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు రాజమౌళి ఇటీవల చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను నమోదు చేసిన ఆయన ఇప్పుడు ప్రపంచ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా చేయడానికి ఆయన ప్లాన్ చేశారు.

ఇప్పటికే ఈ చిత్రం యొక్క కథను విజయేంద్ర ప్రసాద్ రెడీ చేయగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ గా ఇది ఉండబోతుంది అ నే కథనాలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో తన పేరు మారుమోగేలా చేసుకున్న రాజమౌళి ఈ సినిమాతో తప్పకుండా అందరిని మరొకసారి ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆ స్థాయిలోనే స్క్రిప్ట్ను రెడీ చేశాడట విజయేద్రప్రసాద్. పలు కాన్సెప్టులు ఇప్పటికే చర్చకు వచ్చాయని అందులో ఓ కాన్సెప్ట్ను లాక్ చేయబోతున్నారని చెబుతున్నారు.

మరి తొందర్లోనే ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టబోతున్నాడు రాజమౌళి. దీంతో మహేష్ అభిమానులలో ఎంతటి సందోహం నెలకొంటుందనీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదేమైనా తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను చేసి భారీ కాన్వాస్ లో బిగ్ స్కేల్లో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలన్నది రాజమౌళి ప్లాన్. ఇకపోతే ఈ చిత్రాని కంటే ముందు మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలుపెట్టి డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత వచ్చే ఏడాది రాజమౌళి దర్శకత్వంలోని సినిమాను మొదలు పెట్టనున్నాడు. మరి ఈ సినిమా ఈ నేపథ్యంలో తెరకెక్కి సూపర్ స్టార్ అభిమానులను అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: