టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన సిద్ధు జొన్నలగడ్డ తాజాగా డీజే టిల్లు మూవీ లో  హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, విమల్ కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. తక్కువ బడ్జెట్ తో , తక్కువ అంచనాలతో విడుదలైన డీజే టిల్లు మూవీ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని కలెక్షన్ లను కూడా అదిరిపోయే రేంజ్ లో సాధించింది .

ఇలా డీజే టిల్లు సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా డీజే టిల్లు 2 సినిమాను తెరకెక్కించబోతున్నారు . డీజే టిల్లు 2 మూవీ కి సిద్ధు జొన్నలగడ్డ కథ  మరియు డైలాగ్ లను కూడా అందించబోతున్నారు . అలాగే ఈ సినిమా విషయంలో సిద్ధు జొన్నల గడ్డ మరో అడుగు ముందుకు వేసి ఈ సినిమా కోసం మెగా ఫోన్ కూడా పట్టబోతున్నట్లు తెలుస్తుంది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఒక కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది  . డీజే టిల్లు 2 సినిమాలో హీరోయిన్ మారబోతున్నట్లు తెలుస్తోంది . డీజే టిల్లు మొదటి భాగంలో అద్భుతమైన నటనతో సినిమా విజయం లో కీలక పాత్రను పోషించిన నేహా శెట్టి 'డీజే టిల్లు 2' సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నాట్లు తెలుస్తుంది . 

సినిమా కథ విషయంలో ఇదే కీలకమైన మార్పు అని సమాచారం . ఇది ఇలా ఉంటే డీజే టిల్లు రెండో భాగం లో హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకులాటను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది . మొదటి భాగం లోని కొన్ని పాత్రలు రెండవ భాగంలో కూడా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: