విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా యొక్క పోస్టర్ ఇటీవలే విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదిపేసిన ఈ పోస్టర్ కు హీరోయిన్లు అందరు సపోర్ట్ చేయడం అందరి విమర్శకుల నోళ్లను మూయించింది. పోస్టర్ విడుదల అయిన కొద్ది నిముషాలు భారీ గా విమర్శలు వచ్చాయి. అంతేకాదు ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే వాటిని పట్టించుకోకుండా కంటెంట్ పరంగా ఈ సినిమా యొక్క పోస్టర్ ను విడుదల చేసి సినిమా పై హైప్ వచ్చేలా చేసుకుంది.

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 25 వ తేదీన విడుదల కాబోతుఉండడంతో ఈ సినిమా యొక్క ప్రమోషన్ పనులు మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో ఒక్క పోస్టర్ ఇప్పుడు దేశాన్ని ఎంతో ఆసక్తి పరుస్తుంది అని చెప్పొచ్చు. నిజానికి ఈ పోస్టర్ విడుదలై ఇప్పటికి మూడు రోజులు దాటుతున్నా కూడా ఇంకా ట్రెండింగ్ లోనే ఉండడం సినిమా పైఎంత క్రేజ్ ఉందొ చెప్పడానికి నిదర్శనం. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెలాంటి సంచలనాను సృష్టిస్తుందో చూడాలి.

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. కరణ్ జోహార్, చార్మీ, పూరీ జగన్నాధ్ లు ఈ సినిమా ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే వీరి కాంబినేషన్ లో జే జీ ఏమ్ అనే మరో సినిమా కూడా ప్రేక్షకల ముందుకు రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టుకుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ రెండు సినిమాలే కాకుండా విజయ్ దేవరకొండ ఖుషి అనే మరో సినిమా లో కూడా నటిస్తున్నాడు. శివ నిర్వాణసినిమా కి దర్శకుడుగా వ్యవహరిస్తుండగా సమంత కథానాయికగా నటిస్తుంది. మరి ఈ చిత్రాలతో అయన ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ చిత్రాల తర్వాత అయన పెద్ద దర్శకులతో సినిమాలు చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: