ధనుష్ హీరోగా ఇప్పుడు తెలుగులో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. గతంలో ఆయన హీరోగా నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అవుతాయి కానీ ఇప్పుడు ఆయన నేరుగా తెలుగు సినిమాలలో నటించడానికి ఒప్పుకోవడం విశేషం. తమిళంలో స్టార్ హీరోగా ఉన్న ఈ హీరోకి హిందీలో కూడా మంచి గుర్తింపు ఉంది. అక్కడ ఆయన కొన్ని సినిమాల్లో నటించాడు. హీరోగా కేవలం తమిళంలో మాత్రమే కాకుండా హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ అక్కడ తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన సార్ అనే సినిమాను తెలుగు దర్శకుడుతో చేస్తున్నాడు.

ప్రేమ కథ సినిమాలను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు ధనుష్. ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రారంభమయ్యి చాలా రోజులు అయింది ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. ఆ మధ్య ఈ సినిమా యొక్క షూటింగ్ సమయంలో కరోనా బారిన పడిన ధనుష్ ఆ తర్వాత మళ్లీ ఈ సినిమాను చేయడం మొదలుపెట్టాడు. తెలుగు మరియు తమిళ భాషలలో రూపొందుతున్న ఈ సినిమా ను ఇతర భాషలలో డబ్ చేసి విడుదల చేయనున్నారు 

అయితే ధనుష్సినిమా కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పాలని నిర్ణయానికి వచ్చాడట.  దీన్ని బట్టి ఈ చిత్రంలో ఎంతో స్పెషాలిటీ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. భాష సమస్య ఉన్న కూడా రిస్క్ చేసి సినిమా కోసం డబ్బింగ్ చెప్పడం వల్ల మంచి ఫలితాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ధనుష్ సినిమాకు ఇప్పుడు ఇది ఎంతవరకు ప్లస్ అవుతుందో అనేది చూడాలి. ధనుష్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా వేరే ఆర్టిస్ట్ ఆయనకు డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైన పనే. మరి నటనా పరంగా ఇప్పటివరకు ఆకట్టుకున్న ధనుష్ ఇప్పుడు డబ్బింగ్ తో అలరిస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: