నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల బాలయ్య నటించిన అఖండ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుంటే  ఇప్పుడు తాజాగా బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ మాస్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతుంది. ఇకపోతే బాలయ్య కెరీర్ లోనే భారీ యాక్షన్ సినిమా అంటూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.ఇక మొదటి రోజు నుంచి ఈ సినిమా నాలుగు అడుగులు వెనక్కు, రెండు అడుగులు ముందుకు అన్నట్లు సాగుతూ ఉంది.అయితే  సహజంగా తన సినిమాల షూటింగ్ విషయంలో బాలయ్య పనితనం చాలా వేగంగా ఉంటుంది.

 ఇక ప్లాన్ చేసిన షెడ్యూల్ ను రెండు రోజులు ముందుగానే పూర్తి చేయడం బాలయ్యకి ఉన్న అలవాటు. అయితే కానీ భారీ సెట్లు వేసి సినిమాని చుట్టేయడం దర్శకుడికి నచ్చడం లేదు.ఇదిలావుంటే దర్శకుడు గోపీచంద్ ల్యాగ్ టేకింగ్ ఇటు బాలయ్యకు నచ్చలేదు. ఇక ఇది గ్రహించిన గోపీచంద్.. ఈ సినిమాని వేగంగా పూర్తి చేయడానికి 'లో క్వాలిటీ' సెట్ లు, లోకల్ కాస్ట్యూమ్ లు తెచ్చి షూటింగ్ ప్లాన్ చేశాడు. అయితే ఎప్పటిలాగే బాలయ్య సెట్ కి ముందుగానే చేరుకున్నాడు. ఇక అక్కడ సెట్ లు, కాస్ట్యూమ్స్ వగైరా విషయాలు చూసి బాలయ్యలో ఆగ్రహం ఒక్కసారిగా రెట్టింపు అయింది.అంతేకాదు సెట్ లో అందరూ ఉండగానే 'ఏమయ్యా గోపీ.. ఇటు రా' అని అరిచాడు.

అయితే గోపీచంద్ మలినేని వచ్చి ఎదురు నుంచున్నాడు. ఇక అంతే.. అతని పై బాలయ్య సడెన్ గా సీరియస్ అయ్యారు.అంతేకాదు  'సినిమా స్పీడ్ గా తీయడం అంటే.. ఏది పడితే అది చుట్టేయడం కాదురా, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని.. ఇక అన్నిటికి న్యాయం చేయడం' అంటూ బాలయ్య పెద్ద క్లాస్ పీకాడట.ఇక  దీనికితోడు 'నువ్వు చేస్తున్న ఈ సినిమా క్వాలిటీ నాకు అస్సలు నచ్చడం లేదు' అంటూ బాలయ్య, గోపీచంద్ మలినేని మొహం మీద తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు.అయితే మొత్తానికి ఈ నెల 16న నుంచి జరగాల్సిన కొత్త షెడ్యూల్ ను బాలయ్య క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.  అంతేకాక పైగా 'నాకు చెప్పినదేమిటి ? తీస్తున్నదేమిటి ?' ఎట్టిపరిస్థితుల్లో కథ చెప్పినట్టుగానే ఈ సినిమా ఉండాలంటూ గోపీచంద్ కి బాలయ్య వార్నింగ్ కూడా ఇచ్చాడట. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: