టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో చాలాకాలంగా అగ్ర హీరోయిన్ గా వెలుగు వెలిగిన మిల్కీ బ్యూటీ తమన్నాకు యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పగలక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో యువ హీరోయిన్ల దూకుడు ఎక్కువగా ఉన్నా కూడా వారితో సమానంగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఎఫ్ త్రీ సినిమాతో ఈ భామ ప్రేక్షకుల ముందు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన బోళాశంకర్ సినిమాలో నటిస్తోంది తమన్నా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక కేవలం నటనతోనే కాకుండా డాన్సులతో కూడా అదరగొడుతూ ఉంటుంది తమన్నా. 

స్టార్ హీరోలతో పోటీపడి మరి డాన్సులు చేస్తుంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ లో అయితే తమన్నా డాన్స్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ఇప్పటికే జై లవకుశ, సరిలేరు నీకెవ్వరు, గని వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది. ఈ సాంగ్స్ ఆమె కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి తమన్నా నుంచి అద్భుతమైన డాన్స్ ని ఆశించవచ్చా? అంటూ తాజాగా ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు. దీనికి తమన్నా ఆసక్తికరమైన రిప్లై ఇచ్చింది. తాజాగా తమన్నా సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ సెషన్ ని నిర్వహించింది. ఇందులో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానం ఇచ్చింది. 

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవితో మీరు చేస్తున్న భోళా శంకర్ సినిమా నుంచి స్పెషల్ నంబర్ మేము ఆశించవచ్చా? అని ఓ నెటిజన్ అడగ్గా.. దానికి తమన్నా రిప్లై ఇస్తూ.." నేను ప్రామిస్ చేస్తున్నాను. మీరు ఎప్పటికీ నిరాశ చెందరు".. అని చెప్పుకొచ్చింది. దీంతో బోలా శంకర్ సినిమాలో తమన్నా మెగాస్టార్ తో కలిసి చేసే సాంగ్  ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టు తమన్నా హింట్ ఇవ్వడంతో ఈ సాంగ్ చూసేందుకు ఇప్పుడు మెగా ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో మరో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుండగా.. తమన్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: