టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ఆయన నటించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్ ను మూటగట్టుకుంది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చిరంజీవి. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమా కథను మొత్తాన్ని మార్చేసినట్లు ఓ వార్త ఫిలిమ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాల్లోకి వెళితే.. కొన్ని కొన్ని సార్లు డైరెక్టర్ అనుకున్న సినిమాకి చివర వచ్చిన ఔట్పుట్ కి మధ్యన అసలు పొంతనే ఉండకపోవచ్చు. దానికి కారణం నిర్మాత లేదా హీరో ఎవరో ఒకరు సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం.

ఇలా సినిమా మధ్యలోనే కొన్ని మార్పులు, చేర్పులు చేయడం వల్ల ఒక్కోసారి సినిమా ప్లాప్ అవుతుంటుంది. కొన్ని కొన్ని సార్లు హిట్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. #Mega154 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కాస్త నిరాశ చెందుతున్నారట. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ను ఆపేసి డైరెక్టర్ బాబి మరియు రచయిత కోన వెంకట్ ను కలిసి సినిమాలోని సన్నివేశాలను మరింత స్ట్రాంగ్ గా, ఇంపాక్ట్ ఉండేలా రాయమని.. ఇలా రొటీన్ గా సన్నివేశాలు వద్దని చెప్పారట.

ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో ఓ చిన్న పల్లెటూరులో జరగాల్సిన ఈ సినిమా షూటింగ్.. తాజాగా మలేషియా మరియు ఇతర దేశాలకు మారిందని తెలుస్తోంది. అయితే ఫారిన్ ట్రిప్ వల్ల సినిమా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందా? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ మలేషియాకి బయలుదేరడానికి సన్నాహాలు చేస్తున్నారు. విదేశాల్లోనే ఓ భారీ షెడ్యూల్ ని చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే చిరంజీవి పుట్టినరోజు ఉండడంతో ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ చిరంజీవికి తమ్ముడు పాత్రలో కనిపించబోతున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: