ఇటీవల కాలంలో సినిమా ప్రపంచంలో ఎక్కువమంది సెలబ్రిటీల సైతం ప్రేమ వివాహాన్ని చేసుకోవడానికి మక్కువ చూపుతున్నారు. కొందరు మాత్రం మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుంటే మరి కొందరు మాత్రం ఊహించని విధంగా వివాహంతో ఒకేసారి ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా బాలీవుడ్ లో మరొక జంట వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.

రీసెంట్గా కత్రినా కైఫ్ విక్కీ కౌశల్, అలియా భట్ రన్బీర్ కపూర్, వివాహ వార్తలతో మీడియాల హాట్ టాపిక్ గా మారిపోయారు అలాగే త్వరలోనే మరికొన్ని జంటలకు కూడా వివాహం చేసుకోబోతున్నారు అన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి లిస్టులో ప్రముఖ టాలెంటెడ్ నటుడు విద్యుత్ జామ్వాల్ ఉన్నట్లుగా తెలుస్తున్నది. తుపాకీ చిత్రంలో ప్రధాన విలన్ గా ఆకట్టుకున్న విద్యుత్ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ శక్తి ఊసరవెల్లి వంటి సినిమాలలో మంచి నటుడుగా పేరుపొందాడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతను మంచి మంచి పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ హీరో ఒక ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఫ్యాషన్ డిజైనర్ మరెవరో కాదు నందిత అని తెలుస్తుంది. ఇక గత ఏడాది వీరిద్దరూ లండన్ లో వివాహం చేసుకోవాలనుకున్నారట. ఇక సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా అయిపోయినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ విషయంలో నటుడు కాస్త ఇన్ డైరెక్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కూడా లండన్ లో ఒక లొకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక అక్కడే వివాహం కూడా చేసుకోబోతున్నారన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎటువంటి హడావిడి లేకుండా కేవలం తమ కుటుంబ సభ్యుల సమక్షంలో విద్యుత్ నందితను వివాహం చేసుకోబోతున్నట్లుగా సమాచారం. మరి ఈ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ ఇంకా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: