అక్కినేని కుటుంబం నుండి హీరో నాగచైతన్య ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తు చాలా బిజీగా ఉన్నారు ఈ హీరో. తాజాగా నటిస్తున్న థాంక్యూ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమాకు డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు ఉన్నారు. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది ఈ సందర్భంగా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ థాంక్యూ సినిమా సంబంధించి కొన్ని విషయాలను మీడియాతో పంచుకోవడం జరిగింది ఇప్పుడు వాటి గురించి చూద్దాం.


విక్రమ్ కే కుమార్ మాట్లాడుతూ.. థాంక్యూ అనే పదాన్ని మనం నిజజీవితంలో ఎన్నో సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటాము కానీ అసలైన ప్రాముఖ్యత గురించి థాంక్యు చెప్పే సందర్భంలో వాటిని అసలు ఉపయోగించము.. థాంక్యూ అనే పదం చాలా పవర్ఫుల్  పదం. దానికి మనం విలువ లేకుండా చేశామని అంటున్నారు.. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి మా తండ్రిగారే కారణం ఆయనకు నేను ఏ రోజు కూడా థాంక్స్ తెలుపలేదు. కానీ ఒకరోజు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వాస్తవానికి మన తల్లిదండ్రులు మన నుంచి థాంక్యు అనే పదాన్ని ఎన్నటికి కోరరు ఒకవేళ చెప్పినా కూడా వారికి కోపం వస్తుంది.. అయినా కూడా మనం వారికి థాంక్యూ అనే పదం చెప్పాలని విక్రమ్ తెలిపారు.


గత మూడు సంవత్సరాల నుండి నేను చైతన్య కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాము. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి అలాంటి సమయంలో ఈ స్క్రిప్ట్ రావడం జరిగింది ఇందులో నాగచైతన్య మూడు వేరియేషన్ల కనిపిస్తారు. ఇందులో 16 ఏళ్ల పిల్లాడిలా ఆ తర్వాత 21 ఏళ్ల వయస్సు కుర్రాడిలా ఆ తర్వాత 40 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారని తెలిపారు. ఇలా కనిపించడం కోసం చైతన్య చాలా కష్టపడ్డాడు 50 రోజులపాటు స్పెషల్ డైట్ తీసుకొని బరువు తగ్గి తన లుక్కుని మార్చుకున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: