టాలీవుడ్ లో మంచి దమ్మున్న స్టార్ హీరో నిర్మాతల్ని ముప్పతిప్పలు పెడుతున్నారట. ఫటా ఫట్ దనా దన్ అని స్టోరీ లకు అయితే వరుస పెట్టి సైన్ చేసి అడ్వాన్సులు పుచ్చుకుంటున్నారు కానీ అనుకున్న సమయానికి షూటింగ్ లకు మాత్రం కుదరదు అంటూ లేట్ చేస్తుండటం తో నిర్మాతలు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తెలుగు స్టార్ హీరో ఒకరు ఆ మధ్య కొన్ని ఇతర కారణాల వలన సినిమాలకు కొన్నాళ్ళు దూరం అయ్యారు. అయితే మళ్ళీ ఆర్దికంగా అవసరం ఉందని మళ్ళీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. డబ్బుల కోసమే మళ్ళీ సినిమాలు చేస్తున్నట్లు స్వయంగా ఆ హీరోనే ఓ సందర్భం లో చెప్పారనుకోండి అది వేరే విషయం.

అయితే అప్పట్లో ఏడాదికి ఒక సినిమా చేసే ఈ హీరో ఇపుడు ఏడాది లో మూడు, నాలుగు చిత్రాలకు సైన్ చేసేస్తున్నారు. నిర్మాతలు సైతం ఈ హీరో కి ఉన్న క్రేజ్ చూసి ఆయన ఎంత డిమాండ్ చేస్తే అంత... ఎప్పుడంటే అప్పుడే అన్నట్లుగా ఒకే అనుకుంటున్నారు. అయితే అంత బాగానే ఉంది, కానీ అసలు చిక్కు వేరే ఉంది అంటున్నారు ఆ నిర్మాతలు. సైన్ చేసేస్తున్నారు కానీ ఆ హీరో తన ఇతర ప్రాధాన్యతల వలన షూటింగ్ లకు సరిగా హాజరు కావడం లేదంటూ వాపోతున్నారు. అది చాలదు అన్నట్లు తమ చిత్రాలు పూర్తి కాక ముందే వేరే ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తుండటం తో తమ సినిమాలా పరిస్థితి ఏమిటా అని కంగారు పడుతున్నారు.

ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేయకుండా వేరే సినిమాలకు ఒప్పుకోవడం...రెండు, మూడు షూటింగ్ లను లైన్ లో పెట్టడం తీరా సెట్ రెడీ అయ్యాక... మళ్ళీ ఆయన ప్రాధాన్యతల కారణంగా షూటింగ్ పోస్ట్ పోన్ చేయడం వంటివి తరచూ జరుగుతుండటంతో ఆ నిర్మాతల జేబులకు పెద్ద చిల్లులు పడుతున్నాయట. అయితే అటు ఆ హీరోని అడిగే దైర్యం చేయలేక ఇటు తమ సినిమాలు ఎప్పటికి పూర్తి అవుతాయి అన్నది తెలియక తలలు పట్టుకు కూర్చుంటున్నారట సదరు నిర్మాతలు. మరి ఆ హీరో ఎవరు అనేది ఇంకా తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: