హీరో చియాన్ విక్రమ్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభం లో తెలుగులో నేరుగా కొన్ని సినిమాల్లో నటించిన విక్రమ్ ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమాలలో నటించి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

ఇది ఇలా ఉంటే విక్రమ్ కేవలం కోలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అందులో భాగంగా విక్రమ్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా విక్రమ్ , మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ తో పాటు తెలుగు  , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లో జోరుగా కొనసాగిస్తోంది.  

అందులో భాగంగా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న విక్రమ్ , కార్తి , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ , త్రిష లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకులనుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ టీజర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయగా ఈ మూవీ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం విక్రమ్ ఐదు భాషల్లో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పబోతున్నాడు. ఈ విషయాన్ని పొన్నియన్ సెల్వన్ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: