టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దిల్ రాజు గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దిల్ రాజు అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఎన్నో విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.

అలాగే దిల్ రాజు తాజాగా నాగ చైతన్య హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ మూవీ ని నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఇప్పటికే చిత్ర బృందం ఈ సినిమా నుండి ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న థాంక్యూ మూవీ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు. తాజా ఇంటర్వ్యూ లో దిల్ రాజు మాట్లాడుతూ ... 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ని ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నందుకు చూశారు. కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ని మాస్ విజువల్స్ కోసం చూశారు.

అలాగే నాగ చైతన్య అభిమానులు కానివారు థాంక్యూ మూవీ ని ఎందుకు చూడాలి ...  దేనికోసం చూడాలి ... అనే ప్రశ్నకు సమాధానం ఉంది అని దిల్ రాజు థాంక్యూ మూవీ ని మంచి ఫీల్ కోసం చూడాలి. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన థాంక్యూ మూవీ ని చూసిన తరువాత ఆ ఫీల్ మీతో పాటు మీ ఇంటికి వస్తుంది. అలాగే మీ ఎదుగుదలలో మీకు సహకరించినవారికి కాల్ చేసి మాట్లాడేలా థాంక్యూ మూవీ చేస్తుంది. అలాంటి ఒక మంచి ఫీల్ కోసం ఈ మూవీ ని మళ్లీ మళ్లీ చూస్తారనే నమ్మకం ఉంది" అంటూ దిల్ రాజు తాజా ఇంటర్వ్యూ లో  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: