రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలాకాలమే అవుతున్నా మధ్యలో సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కే జి ఎఫ్ చాప్టర్ 2' విడుదల పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల పాటు ఆగిపోయింది. అలాగే ప్రభాస్ కూడా సలార్ సినిమాతో పాటు ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటూ ఉండటంతో ఈ సినిమా షూటింగ్ మరింతగా ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా పనులు అన్ని ముగియడం, అలాగే ప్రభాస్ కూడా సలార్ సినిమాకు ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తూ రావడంతో,  ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమాను అదిరిపోయే యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో సలార్ సినిమా లోని యాక్షన్ సన్నివేశాలపై ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో సినీ ప్రేమికులు ఆసక్తిని చూపిస్తున్నారు. 

ఇది ఇలా ఉంటే సలార్ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అవుతున్నా ఏవో ఒకటి రెండు పోస్టర్ లు తప్ప చిత్రబృందం ఈ మూవీ పెద్దగా ఎలాంటి అప్డేట్ లను బయటకు వదలలేదు. దానితో ప్రభాస్ అభిమానులు సలార్ మేకర్స్ పై కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.  ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ చిత్ర బృందం ప్రస్తుతం ఈ సినిమా టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: