ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న యంగ్ టాలీవుడ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. కిరణ్ అబ్బవరం ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకు వెళుతూ ఫుల్ జోష్ ను చూపిస్తున్నాడు. రాజావారు రాణి గారు మూవీ తో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. 

ఆ తర్వాత సబాస్టియన్ తాజాగా సమ్మతమే మూవీ లతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో  సబాస్టియన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం అలరించలేకపోయింది. సమ్మతమే మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం 'రూల్స్‌ రంజన్' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. ఏఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్‌ , స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ లో ఆశిష్‌ విద్యార్థిబ్, అజయ్‌ , వెన్నెల కిశోర్ , వైశాలి , హిమాని , జయవాణి , ముంతాజ్ , సత్య బాలీవుడ్ నటీనటులు అన్ను కపూర్ , సిద్ధార్థ సేన్ , అతుల్‌ పర్చులే తదితరులు ఈ మూవీలో నటించబోతున్నారు.

రత్నంకృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండే చిత్ర బృందం కిరణ్ అబ్బవరం కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం బ్లాక్ కలర్ లో ఉన్న సూట్ ను ధరించి చేతిలో ఒక బ్యాగ్ ని పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం రూల్స్‌ రంజన్ మూవీ లోని కిరణ్ అబ్బవరం  ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: