ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో వరుస విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్న హీరో లలో నాగ చైతన్య ఒకరు. నాగ చైతన్య పోయిన సంవత్సరం విడుదల అయిన లవ్ స్టోరీ మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.  

అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో బంగార్రాజు మూవీతో మరో విజయాన్ని బాక్సాఫీస్ నాగ చైతన్య దగ్గర అందుకున్నాడు. ఇలా వరుస విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్న నాగ చైతన్య తాజాగా థాంక్యూ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా, రాశి కన్నా ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కథానాయికగా నటించింది. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించిన, ఈ సినిమాకి తమన్  సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని జులై 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఇప్పటికే థాంక్యూ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ చిత్ర బృందం పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ మూవీ ని  ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా థాంక్యూ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ను విడుదల చేసింది.

తాజాగా థాంక్యూ చిత్ర బృందం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది. థాంక్యూ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని జూలై 16 వ తేదీన సాయంత్రం 5 గంటలకు సర్ సి ఆర్ రెడ్డి కన్వెన్షన్ హాల్ , ఎ యూ , విజాగ్ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య 'థాంక్యూ'  మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: