మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా ,  ఈ మూవీ లో  లేడీ సూపర్ స్టార్ నయనతార చిరంజీవి కి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది.

అలాగే ఈ మూవీ లో  సల్మాన్ ఖాన్ ,  సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిరంజీవి కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిరంజీవి లుక్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించి మిగిలి ఉన్న కొంత భాగం షూటింగ్ ని జూలై 28 వ తేదీ నుండి ముంబై లో ప్రారంభించాలని చిత్ర బృందం ప్లానింగ్ వేసినట్లు తెలుస్తోంది.

అలాగే ముంబై లోనే సినిమా షూటింగ్ మొత్తాన్ని ముగించాలని చిత్ర బృందం ప్రణాళికలను వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా యంటే ఆచార్య మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుండో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: