సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మందికి మాత్రమే మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ మరియు మంచి విజయం లభిస్తుంటాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీతోనే అదిరిపోయే క్రేజ్ మరియు సూపర్ హిట్ ను అందుకున్న ముద్దుగుమ్మలో పొడుగుకాళ్ల సుందరి ఫారియా అబ్దుల్లా ఒకరు.

అందాల ముద్దుగుమ్మ ఫారియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ జాతిరత్నాలు తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో చిట్టి అనే పాత్రలో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. మొదటి సినిమాతోనే  ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ స్పెషల్ సాంగ్ కూడా సూపర్ హాట్ అయ్యింది.  

ప్రస్తుతం ఫారియా అబ్దుల్లా ,  మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు మరో క్రేజీ సినిమాలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర బృందం ఫారియా అబ్దుల్ ను ఎంపిక చేసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే ఫారియా అబ్దుల్లా మరో క్రేజీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: