లాల్ సింగ్ చడ్డా ట్రైలర్ తో అమీర్ ఖాన్ మరొకసారి ప్రశంసలు అందుకుంటున్నారు. అసలు నడవగలడో లేదో తెలియని ఒక అమాయకుడైన ఒక బాలుడు నడుస్తూ పరిగెడుతూ చివరికి ఆర్మీలో యుద్ధ వీరుడు గా కనిపించడం జరుగుతుంది.. ఇదంతా ఒక మిరాకిల్లా అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక సాధారణ మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా మారుతుందో ముందే చెప్పలేం అనే విధంగా ఆసక్తి రేపుతోంది. అమ్మ చెబుతూ ఉండేది తలరాతలు ముందే రాసి ఉంటారని.. డైలాగ్ తో మొదట సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ చెప్పే డైలాగులు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా చేస్తున్నాయి.


హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్ కి ఈ సినిమా రిమెకుగా చేయడం జరుగుతుంది భారతదేశంలో అన్ని భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అమీర్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు.లాల్ సింగ్ చడ్డా  తెలుగు తమిళ్ హిందీలో అత్యంత భారీగా విడుదల చేయడం జరుగుతుంది ఈ చిత్రంతో నాగచైతన్య హిందీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు ఇందులో అమీర్ ఖాన్ తో పాటు పనిచేసే ఆర్మీ మ్యాన్ గా కనిపిస్తున్నారు నాగచైతన్య. ఇక కరీనా కపూర్ అమీర్ ఖాన్ సరసన హీరోయిన్గా నటించింది.

ట్రైలర్లు కరీనా కపూర్ తో  స్నేహం నుంచి ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. ఇక అల వీరు ఎదిగే క్రమంలోనే ప్రేమగా మారి వివాహ విషయానికి వస్తే మన దారులు వేరే అన్నట్టుగా కరీనా చెప్పడం ఈ ట్రైలర్ లో తెలుస్తోంది.లాల్ సింగ్ చడ్డా  సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమాని అద్వైత్ చందన్  దర్శకత్వం వహించారు. దాదాపుగా ఈ సినిమా కోసం 180 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. తెలుగు సినిమా వెర్షన్ కి చిరంజీవి సమర్పికులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: