ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన నటించిన పుష్ప సినిమాతో మరింత పాపులారిటీ ని సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.ఇక తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఎలాంటి ప్రమోషన్స్ చేపట్టకుండానే తానేంటో నిరూపించుకుని అక్కడ రూ. 100 కోట్ల మార్క్ రీచ్ అయ్యి అక్కడ కూడా మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం గమనార్హం.

ఇదిలావుంటే  గతంలో కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా రాబోతోందని వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే. ఇక  ఈ సినిమాకు సంబంధించి తాజాగా లేటెస్ట్ అప్డేట్ బాగా వినిపిస్తోంది.అంతేకాకుండా ఎన్టీఆర్ తో కొరటాల శివ తన సినిమాను పూర్తి చేసిన వెంటనే అల్లు అర్జున్తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని 2023 జనవరిలోనే సినిమా మొదలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. పోతే అప్పట్లోనే బన్నీకి కొరటాల శివ ఒక కథను చెప్పాడని, ఇక ఆ కథ నే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నట్లు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.

 అంతేకాకుండా ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొరటాల శివ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే ఇప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇక ఇదిలా ఉండగా డైరెక్టర్ కొరటాల శివ టాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరోతో కూడా ఒక సినిమా చేయాలని ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఇకపోతే  ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్తో సినిమా చేస్తాడట. అయితే మరి ఈ హీరోల ఇమేజ్ ను బట్టి కథలు రాసే కొరటాల అల్లు అర్జున్ కోసం ఎలాంటి కథ రాశాడో అని ప్రేక్షకులు కూడా తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక  ఇదిలావుంటే ఆచార్య సినిమా బెడిసి కొట్టినప్పటికీ కచ్చితంగా అల్లు అర్జున్తో పక్క హిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తానని కూడా కొరటాల శివ వెల్లడించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: