మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే  చిరంజీవి తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా  నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీ ని కొన్ని రోజుల క్రితం ప్రత్యేకంగా ప్రివ్యూ చూసిన విషయం మనఅందరికీ తెలిసిందే.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు లో సమర్పిస్తాడు.  

దానితో చిరంజీవి తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్నాడు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ... అమీర్ ఖాన్ ఎక్స్పరిమెంట్ చేసి జనాలను ఒప్పించి ... మెప్పించే మూవీ లు చేస్తాడు. నేను జనామోదం గా ఉండాలి , జనరంజకంగా ఉండాలి , ఏం చేస్తే జనాలు చప్పట్లు కొడతారు అని ఆలోచించి మినిమమ్ గ్యారెంటీ గా ఉండే మూవీ లు చేస్తూ ఉంటాను అని తాజా ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి , అమీర్ ఖాన్ గురించి చెప్పుకొచ్చాడు.

ఇది ఇలా ఉంటే లాల్ సింగ్ చడ్డా మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరో అయిన అక్కినేని నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో  బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఆగస్ట్ 11 వ తేదీన హిందీ తో పాటు తెలుగు , తమిళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: