కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న కిచ్చ సుదీప్ గురించి కొత్తగా తెలుగు సినిమా ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించిన సుదీప్ ఆ తర్వాత తెలుగు నుండి విడుదల అయిన భారీ పాన్ ఇండియా మూవీ లు అయిన బాహుబలి ,  సైరా నరసింహారెడ్డి మూవీ లలో  కీలక పాత్రలలో నటించి మెప్పించాడు .

ఇలా తెలుగు లో ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన సుదీప్ తాను నటించిన మూవీ లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఇది ఇలా ఉంటే మరో సారి తాను నటించిన కన్నడ సినిమా విక్రాంత్ రోనా ను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నాడు . ఈ మూవీ ని జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రమోషన్ లలో పాల్గొంటూ మూవీ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

తెలుగు లో విడుదలకు సిద్ధంగా ఉన్న విక్రాంత్ రోనా మూవీ ని హైదరాబాద్ లో  తక్కువ టిక్కెయ్ ధరలకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో విక్రాంత్ రోనా మూవీ టికెట్ ధరలు గరిష్టంగా 150 రూపాయలు మాత్రమే  ఉండేటట్లు తెలుస్తోంది.  ఇలా తక్కువ టికెట్ ధరలతోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ సినిమాకు అనూప్ బండారి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: