ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో  ఆవరేజ్ గా ఉన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకునేవి. అలాగే హిట్ ,  సూపర్ హిట్ సినిమాలు అదిరిపోయే కలెక్షన్లను బాక్స్ ఆఫీస్  దగ్గర వసూలు చేసేవి. కానీ ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితులు చాలా వరకు తగ్గాయి. మునుపటితో పోలిస్తే ప్రస్తుతం టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ సినిమాకు కలెక్షన్లు మాత్రం ఆ రేంజ్ లో రావడం లేదు. వీటికి 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

ఎంతో మంది సినీ ప్రేమికులు థియేటర్ లలో సినిమాలు చూడడం కంటే 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో సినిమాలు చూడడానికి ఇష్టపడుతూ ఉండడంతో థియేటర్ లలో మంచి సినిమాలు విడుదల అయినా కూడా కలెక్షన్ లు మాత్రం పెద్ద మొత్తంలో రావడం లేదు. అలాగే టికెట్ ధరలు కూడా కాస్త ఎక్కువగా ఉండడం వల్ల  కూడా చాలా మంది ప్రేక్షకులు సినిమా థియేటర్ లోకి రావడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి  చిన్న సినిమాలు మరియు మీడియం సినిమాలు , పెద్ద సినిమాలు అని మూడు కేటగిరీలుగా టిక్కెట్ ధరలను విభజించారు. ఆ టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

చిన్న సినిమాలు : ఏ మరియు బి సెంటర్స్ లో 100 మరియు 125 రూపాయల వరకు ఉండనున్నట్లు , సి సెంటర్స్ లో 70 మరియు 125 రూపాయల వరకు ఉన్నది ఉన్నట్లు ప్రకటించింది.
మీడియం  సినిమాలు : ఏ మరియు బి సెంటర్స్ లో 112 మరియు 177 రూపాయల వరకు ఉండనున్నట్లు , సి సెంటర్స్ లో 100 మరియు 177 రూపాయల వరకు ఉన్నది ఉన్నట్లు ప్రకటించింది.
పెద్ద సినిమాలు : ఏ మరియు బి సెంటర్స్ లో 177 మరియు 295 రూపాయల వరకు ఉండనున్నట్లు , సి సెంటర్స్ లో 150 మరియు 295 రూపాయల వరకు ఉన్నది ఉన్నట్లు ప్రకటించింది. ఈ టికెట్ ధరలు ఆగస్ట్ 1 వ తేదీ నుండి అమలులోకి రాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: