యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ,  ఆది పినిశెట్టి ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు .

మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు . ఈస్మార్ట్ శంకర్ , రెడ్ వంటి మంచి విజయవంతమైన మూవీ ల తర్వాత రామ్ పోతినేని హీరో గా నటించిన సినిమా కావడం, తమిళ క్రేజీ దర్శకుడు లింగుసామి ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై సినీ ప్రముఖులు భారీ అంచనాలు పెట్టుకున్నారు . అలా సినీ ప్రేమికులు భారీ అంచనాలు కలిగి ఉండటంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ది వారియర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 38.10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.  దానితో ది వారియర్ మూవీ 39 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.

భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ రన్ ని మొదలుపెట్టిన ది వారియర్ మూవీ ఇప్పటి వరకు 10 రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 10 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ది వారియర్ మూవీ 20.73 కోట్ల షేర్ 35.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లము వసూలు చేసింది. దానితో ది వారియర్ మూవీ ఇంకా 18.27 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని సక్సెస్ మూవీగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: