సినిమా ఇండస్ట్రీలో సినిమా కి  కొన్ని కథలు కొందరు హీరోలకు మాత్రమే సూట్ అవుతాయనే సంగతి తెలిసిందే. ఇకపోతే బొమ్మరిల్లు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ కథ తనకు సూట్ కాదని సున్నితంగా రిజెక్ట్ చేశారు.ఇదిలావుంటే జూనియర్ ఎన్టీఆర్ అలా రిజెక్ట్ చేసిన సినిమాలలో అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన రణం సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.ఇకపోతే  ఆమ్మ రాజశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాగా రణం సినిమా కథను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వినిపించానని అయితే ఆ కథ తారక్ కు సూట్ కాదని నాకు తెలుసని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక సినిమాలో ఒక సీన్ ప్రకారం హీరో విలన్ ముందు కూర్చొని ఉండాలని అయితే జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ కు ఆయన స్థాయిని తగ్గించి చూపించడం సరి కాదని తాను భావించానని ఆయన కామెంట్లు చేశారు. అయితే రణం కథ విని జూనియర్ ఎన్టీఆర్ గోపీచంద్ ఈ కథలో నటిస్తే బాగుంటుందని చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు.ఇక ఆ సమయంలో సంతోష్ శ్రీనివాస్ ద్వారా నేను గోపీచంద్ ను కలిశానని ఆయన కామెంట్లు చేశారు. కాగా గోపీచంద్ రణం మూవీ కథ విని వెంటనే ఓకే చెప్పారని సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకుందని అమ్మ రాజశేఖర్ అన్నారు.

పోతే అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత రోజుల్లో పలు సినిమాలకు దర్శకత్వం వహించినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.ఇదిలావుంటే గతంతో పోల్చి చూస్తే అమ్మ రాజశేఖర్ కు సినిమా ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ షో తెలుగులో అమ్మ రాజశేఖర్ పాల్గొన్నా ఈ షో ఆయనకు పెద్దగా ఉపయోగపడలేదనే సంగతి తెలిసిందే. కాగా అమ్మ రాజశేఖర్ కు అవకాశాలు తగ్గుతున్నా ఆయనను అభిమానించే వాళ్ల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉండటం గమనార్హం. ఇదిలావుంటే గోపీచంద్ రణం సినిమాలో నటించి సక్సెస్ సాధించడానికి ఒక విధంగా జూనియర్ ఎన్టీఆర్ కారణమని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: