టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ల మధ్య ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతోమంది హీరోయిన్లు టాప్ హీరోయిన్లు గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇద్దరు కొత్త హీరోయిన్ల మధ్య పోటీ భారీగానే ఏర్పడింది. వారే కృతి శెట్టి మరియు శ్రీ లీల. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకుంది కృతి శెట్టి.

ఆ తర్వాత ఆమెపై పెద్ద హీరోల చూపు కూడా పడింది వారందరూ ఆమెను తమ సినిమాలలో పెట్టుకునేందుకు ఎంతగానో ఆసక్తి చూపించారు. అలా వరుస సినిమాలను చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అగ్ర హీరోయిన్ రేసులో మొదటి స్థానం లో నిలిచింది అని చెప్పవచ్చు. అందానికి అందం అభినయానికి అభినయం ప్రదర్శిస్తూ కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు పెద్ద హీరోయిన్ గా మారుతుందో చూడాలి. ఇకపోతే సినిమా పరిశ్రమలోకి వచ్చి ఒకే ఒక్క సినిమా చేసిన హీరోయిన్ శ్రీ లీల ఇప్పుడు భారీ స్థాయిలో క్రేజ్ ను అందుకున్న హీరోయిన్ అని చెప్పాలి.

ఆమె రెండవ సినిమా ఒక పెద్ద హీరోతో విడుదల కావడానికి సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలోనే మొదటి సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులను వేరే లెవెల్ లోకి అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు చాలా మంది మేకర్స్ ఈ ఇద్దరిలో ఎవరిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలో అన్న సందిగ్ధతలో ఉన్నారు. మరి భవిష్యత్తులో వీరి క్రేజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.వీరు మాత్రమే కాకుండా వీరికి పోటీగా మరికొంతమంది హీరోయిన్ లు కూడా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు. వారు కూడా వీరికి మంచి పోతీనీ ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. మరి ఈ పోటీ లో ఎవరు నేగ్గుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: