టాలీవుడ్ సినిమా పరిశ్రమలోనీ హీరోలు ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియం రేంజ్ సినిమాలు చేసే హీరోలు కూడా ఈ తరహా సినిమాలలో చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో వారు తప్పకుండా ఆలోచించి ఈ సినిమాలను చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్న అంచనా సినిమా విశ్లేషకులు చేస్తున్నారు. దానికి కారణం ఇటీవల ఏర్పడుతున్న కొన్ని పరిస్థితులు సినిమా పరిశ్రమకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడమే.

థియేటర్లలో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడడం లేదు. ఓటిటిలో వచ్చే సినిమాలకు బాగా అలవాటు పడిపోవడంతో ఈ విధమైన ఇబ్బంది ఏర్పడుతుంది. పెద్ద హీరోల సినిమాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. వందకోట్ల పైపడి తెరకెక్కించే సినిమాలకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడటం లేదు. 10 కోట్లలోపు బడ్జెట్తో రూపొందే సినిమాలకు కూడా ఎటువంటి డోకా లేదు. కానీ ఆ మీడియం రేంజ్ బడ్జెట్లో తెరకెక్కే సినిమా లకే ఇప్పుడు ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. మీడియం రేంజ్ హీరోలే ఈ తరహా సినిమాలను చేస్తూ ఉంటారు.

30 నుంచి 40 కోట్ల మధ్య బడ్జెట్లతో వారు ఈ తాతా సినిమాలను చేస్తూ ఉంటారు. అటువంటి సినిమాలను ప్రేక్షకులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి. ఇప్పటికైనా ఆ విధంగా సినిమాలను చేసే హీరోలు కొంత ఆలోచించి ముందుకు దిగాలని చెబుతున్నారు. మరి వారు ఈ ట్రెండ్ ను ఏ విధంగా మార్చి ప్రేక్షకులను ఏవిధంగా సినిమాలకు వచ్చేలా చేస్తారో చూడాలి. ఇప్పటికైతే మంచి మంచి సినిమాలు వస్తేనే చేస్తే సినిమాలును ప్రేక్షకులు చూస్తున్నారు. లేదంటే వారు సినిమాలు చూస్తారా అనేది సందేశంగా ఉంది. గతంలో ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదు. దియేటర్ లలోనే సినిమాలు వస్తాయి కాబట్టి అందులోనే చూసే వారు. ఇప్పుడు ఒటీటీ లు రావడంతో ఈ సినిమా లు అక్కడ చూడడానికి ఇష్టపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: