అందాల ముద్దుగుమ్మ క్యాథరిన్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని సాధించినప్పటికి క్యాథరీన్ కు మాత్రం ఈ సినిమా మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త వెనుకబడిపోయిన క్యాథరీన్ ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన జోష్ ను చూపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే క్యాథరిన్ కొన్ని రోజుల క్రితమే బాల తందనాన మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా క్యాథరిన్ రెండు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు కూడా ఆగస్ట్ నెలలోనే విడుదల కావడం విశేషం. ఆగస్ట్ నెలలో విడుదలకు రెడీగా ఉన్న బింబిసార , మాచర్ల నియోజకవర్గం సినిమాలలో క్యాథరీన్ హీరోయిన్ గా నటించింది.

బింబిసార మూవీ ఆగస్ట్ 5 వ తేదీన విడుదల కానుండగా , మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్ట్ 11 వ తేదీన విడుదల కాబోతుంది. బింబిసార మూవీ లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా , మాచర్ల నియోజకవర్గం మూవీ లో నితిన్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలపై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కనుక అనుకున్న రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నట్లు అయితే క్యాథరీన్ కు కూడా అదిరిపోయే సినిమా అవకాశాలు ఈ రెండు మూవీ ల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: