కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న ధనుష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ధనుష్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగు లోకి డబ్ అయ్యి  మంచి విజయాలను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా అందుకున్నాడు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ధనుష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. దర్శకుడు వెంకీ అట్లూరి , వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తొలిప్రేమ మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత రంగ్ దే మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి ,  ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సార్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. సార్ మూవీ లో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా , జీవి. ప్ర‌కాష్ కుమార్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

సితార ఎంట‌ర్టైన‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సార్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి రెండు అదిరిపోయే అప్డేట్ లను విడుదల చేసింది. సార్ సినిమా ఫస్ట్ లుక్ ను జూలై 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మరియు టీజర్ ను జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: