కన్నడ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న కిచ్చ సుదీప్ ఇప్పటికే కొన్ని తెలుగు మూవీ లలో కూడా  నటించి టాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగానే అలరించాడు. అలాంటి సుదీప్ తాజాగా విక్రాంత్ రోనా అనే అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించబోతుంది.

ఇప్పటికే జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఈ మూవీ లో చేసిన ఒక సాంగ్ కు ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే విక్రాంత్ రోనా మూవీ ఈ రోజు అనగా జూలై 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కన్నడ తో పాటు తెలుగు , హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.  ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా తెలుగు ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ మూవీ ని థియేటర్ లలో ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  తెలుగు సినీ ప్రేమికులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ అదిరిపోయే రేంజ్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి విక్రాంత్ రోనా ఏ రేంజ్ థియేటర్ లలో విడుదల కాబోతుంది తెలుసుకుందాం.

నైజాం : 150 , సీడెడ్ : 50 , : 170 .
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రాంత్ రోనా మూవీ 370 థియేటర్ లలో విడుదల కాబోతుంది.
మూవీ 2 డీ వర్షన్ తో పాటు , 3 డీ వర్షన్ తో కూడా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: