తాజాగా మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ని రేపు అనగా జూలై 29 వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ ను మూవీ యూనిట్ విడుదల చేయగా , ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలాగే తాజాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ బృందం మాస్ నోటీస్ అనే పేరుతో ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఆ వీడియో కూడా అదిరిపోయే రేంజ్ లో ఉత్కంఠను రేపే ఈ విధంగా ఉంది. ఇలా ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రవితేజ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటం వల్ల ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ మొత్తం  థియేటర్ లలో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.

నైజాం : 235 , సీడెడ్ : 120 , ఆంధ్ర : 315 . మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ మూవీ 670 థియేటర్ లలో విడుదల కాబోతుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 80 , ఓవర్ సీస్ లో 250 ప్లస్ . మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ 1000 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: